పినపాక: మండలంలోని జానంపేట గ్రామంలో ఈ నెల 24వ తేదీన జరగనున్న కొమురంభీం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరుకావాలని ఆదివాసీ ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను హైద్రాబాద్లో కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఐక్యవేదిక మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్, ఎంపీటీసీలు కాయం శేఖర్, పొలిశెట్టి హరీష్, భూపాలపట్నం సర్పంచ్ కృష్ణంరాజులు పాల్గొన్నారు.