జూలూరుపాడు, మే 01 : యూరప్ దేశాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అలముకున్న కార్మిక ఉద్యమంలో ఎందరో కార్మిక నాయకులు, కార్యకర్తలు అసువులు బాసరని, ఆ త్యాగదనుల పోరాట ఫలితమే నేడు ఈ ఎనిమిది గంటల పని దినం అని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్స వాన్ని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, హమాలీ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఆటో కార్మికులు, రైతు కూలీలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో యూనియన్ జెండా ఎగురవేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కార్మికులు, శ్రామికుల శ్రమ దోపిడికి వ్యతిరేకంగా అమెరికాలోని చికాగో నగరంలో ప్రైవేటీకరణ, పారిశ్రామికరణ, గ్లోబలైజేషన్ విధానానికి 18 గంటల పని దినానికి వ్యతిరేకంగా పురుడు పోసుకున్న ఉద్యమమే ప్రపంచ కార్మిక ఉద్యమం అన్నారు. ప్రపంచ కార్మికుల పోరాటానికి పెట్టుబడిదారి వర్గం తలవంచక తప్పలేదన్నారు. ఎందరో త్యాగదనుల పోరాట ఫలితమే ఈ ఎనిమిది గంటల పని దినం, దీని వెనక గొప్ప త్యాగాల చరిత్ర ఉందన్నారు. అటువంటి త్యాగదనులను స్మరించుకుంటూ జరుపుకునే ప్రపంచ పండగే మే డే అన్నారు. ఈ కార్యక్రమాన్ని మనందరం జరుపుకోవడం అంటే వారి త్యాగాలని స్మరిస్తూ గుర్తు చేసుకోవడమే అన్నారు. కార్మికులు, కర్షకుల ఐక్యత వర్ధిల్లాలని కోరుకుందామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు కమ్యూనిస్టు పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Julurupadu : త్యాగధనుల పోరాట ఫలితమే 8 గంటల పనిదినం : కార్మిక సంఘాల నేతలు