శనివారం 05 డిసెంబర్ 2020
Khammam - Nov 23, 2020 , 01:09:11

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

  •  ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌
  • మున్సిపల్‌ కార్మికుల   క్రీడా పోటీలు ప్రారంభం
  •  బ్యాటింగ్‌ చేసి ప్రారంభించిన కలెక్టర్‌

మయూరిసెంటర్‌ : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందింప చేస్తాయని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సర్థార్‌ పటేల్‌ స్టేడియంలో నగరపాలక శాఖలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల క్రికెట్‌ పోటీలను వారు బ్యాటింగ్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నిత్యం పట్టణ పరిధిలో పారిశుధ్య పనులు చేపడుతూ నగరాన్ని స్వచ్ఛ ఖమ్మంగా ఉంచుతూ వ్యాధుల నివారణలో ముందంజలో ఉన్నారని అన్నారు. ఎప్పుడూ విధుల్లో నిమగ్నమైన కార్మికులకు ఇలాంటి క్రీడలతో మానసికోల్లాసంతో పాటు ఒత్తిడిని కూడా అధిగమించవచ్చని, క్రీడల నిర్వహణతో కార్మికుల్లో సోదర భావం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్‌ కమిషనర్‌ మల్లీశ్వరి, మున్సిపల్‌ డీఈ రంగారావు, జిల్లా యువజన క్రీడలాధికారులు, కోచ్‌ అక్భర్‌, అంపైర్‌ మతీన్‌, ఇతర క్రీడాకార్లు తదితరులున్నారు. 

పటేల్‌ జట్టుపై ఠాగూర్‌ జట్టు విజయం..

గత ఆదివారం ఖమ్మం జిల్లాలో నగర పాలక కార్మికవిభాగ క్రికెట్‌ పోటీలు పటేల్‌ స్టేడియంలో ప్రారంభమైన విషయం విధితమే. ఇందులో భాగంగా పటేల్‌, ఠాగూర్‌ జట్లు పోటీలో నిలవగా టాస్‌ గెలుచుకున్న పటేల్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుని నిర్ణీత 15ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 89 పరుగులు చేయగా, ఠాగూర్‌ జట్టు 5 వికెట్ల నష్టానికి 14 ఓవర్లలో 90 పరుగులు సాధించి  పటేల్‌ జట్టుపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. డిసెంబర్‌ 1 వ తేదీన నెహ్రూ జట్టు, ఠాగూర్‌ జుట్లు తలపడనున్నాయి.