శుక్రవారం 03 జూలై 2020
Khammam - Jun 05, 2020 , 02:31:13

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

కామేపల్లి : వానకాలంలో విజృంభించే సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అడిషనల్‌ కలెక్టర్‌ మొగిలి స్నేహలత, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ సూచించారు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి దవాఖానలో అందజేస్తున్న వైద్యసేవలు, సౌకర్యాలను వైద్యాధికారులు డాక్టర్‌ స్రవంతి, రత్నమనోహర్‌ను అడిగి తెలుసుకున్నారు.  పీహెచ్‌సీలో ప్రసవాలు చేయకపోవడంపై వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణగుప్తా, సర్పంచ్‌ అజ్మీరా రాందాస్‌నాయక్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. logo