ఇండియాపై నిషేధం.. పాకిస్థాన్‌లో వందకు చేరిన కిలో చక్కెర

ఇస్లామాబాద్: ఇండియా దిగుమతులపై నిషేధం విధించిన పాకిస్థాన్‌లో ఇప్పుడు చక్కెర ధర 100 పాకిస్థాన్ రూపాయలకు చేరింది. దాయాది దేశం నుంచి దిగుమతులు చేసుకోకపోవడంతో అక్కడ చక్కెరకు కొరత ఏర్పడింది. తాజాగా ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ (టీసీపీ) 50 వేల టన్నుల చక్కెర దిగుమతులకు గ్లోబల్ టెండర్లను పిలిచింది. ఇందులో ఇండియా పేరు లేదు. ఇది పాకిస్థాన్ దురదృష్టమంలూ భారత చక్కెర పరిశ్రమ అనడం గమనార్హం. గతంలోనూ ఈ టెండర్లు పిలవగా.. ధర చాలా ఎక్కువగా ఉండటంతో వాటిని రద్దు చేసింది. ఇప్పుడు చక్కెరకు తీవ్ర కొరత ఏర్పడటంతో మరోసారి టెండర్లు పిలవక తప్పలేదు.
గత వారం ఇండియా నుంచి చక్కెర, పత్తి దిగుమతులకు పాకిస్థాన్ ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. పాక్ కేబినెట్ మాత్రం అంగీకరించలేదు. ఇండియా, ఇజ్రాయెల్‌లాంటి నిషేధిత దేశాల నుంచి మాత్రం తమకు కార్గోను సరఫరా చేయవద్దని ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ తాజా టెండర్లలో స్పష్టం చేసింది. దీనిపై ఆలిండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ చైర్మన్ ప్రఫుల్ విఠలానీ స్పందించారు. ఇది పాకిస్థాన్ దురదృష్టం. ఇండియా షుగర్ కంటే తక్కువ ధర, నాణ్యత, వేగంతో మిగతా వాళ్ల నుంచి చక్కెర పొందగలరా అని ఆయన ప్రశ్నించారు.
ఇతర దేశాల కంటే పాకిస్థాన్‌కు ఇండియా నుంచే చాలా వేగంగా, చౌకగా చక్కెర దిగుమతి చేసుకోవచ్చు. పంజాబ్ మీదుగా ఈ కార్గో పాక్‌కు చేరుతుంది. ఇండియా నుంచి టన్నుకు కేవలం 398 డాలర్లు మాత్రమే అవుతుండగా.. ఇప్పుడు పాక్ మాత్రం కనీస బిడ్‌గా 540 డాలర్లు అందుకోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
దేశంలో కొత్తగా 96,982 కొవిడ్ కేసులు
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
ఈవీఎంతో బంధువుల ఇంటికి.. సెక్టార్ ఆఫీసర్ సస్పెండ్
ఓటేసిన రజనీకాంత్, కమల్ హాసన్
ఓటు హక్కు వినియోగించుకున్న ‘మెట్రో మ్యాన్’
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

