ఈవీఎంతో బంధువుల ఇంటికి.. సెక్టార్ ఆఫీసర్ సస్పెండ్
ఈవీఎం | సెక్టార్ ఆఫీసర్ పోలింగ్ బూత్‌లో నిద్రించకుండా, ఈవీఎం, వీవీప్యాట్ తీసుకుని తన బంధువైన టీఎంసీ నాయకుడు గౌతం ఘోష్ ఇంటికి వెళ్లి నిద్రించాడు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో దశలో భాగంగా 31 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. హౌరా జిల్లాలోని ఉలుబేరియా ఉత్తర్ నియోజకవర్గంలోని సెక్టార్ 17కు తపన్ సర్కార్‌ను సెక్టార్ ఆఫీసర్‌గా ఎన్నికల అధికారులు నియమించారు.
దీంతో పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సామాగ్రితో నిన్న సాయంత్రమే తపన్ సర్కార్ తన సిబ్బందితో చేరుకున్నారు. అయితే సెక్టార్ ఆఫీసర్ పోలింగ్ బూత్‌లో నిద్రించకుండా, ఈవీఎం, వీవీప్యాట్ తీసుకుని తన బంధువైన టీఎంసీ నాయకుడు గౌతం ఘోష్ ఇంటికి వెళ్లి నిద్రించాడు. ఈ విషయం బీజేపీ కార్యకర్తలకు తెలియడంతో.. వారు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. తక్షణమే తపన్ సర్కార్‌తో పాటు పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసులను కూడా సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తపన్ సర్కార్ ఈసీ నిబంధనలు ఉల్లంఘించాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే ఆ ఈవీఎం, వీవీప్యాట్‌ను పోలింగ్‌లో వాడొద్దని, వాటి స్థానంలో వేరే ఈవీఎం, వీవీప్యాట్‌ను వాడాలని సూచించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

