MLA Vijayaramana Rao | కాల్వ శ్రీరాంపూర్ సెప్టెంబర్ 19 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి నుండి మీర్జంపేట రోడ్డు మధ్యలో ఉన్న నక్కల వాగు పై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణంకు రూ.కోటి55 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఎమ్మెల్యే విజయ రమణారావు నిధులు మంజూరు చేయించారని తారుపల్లి లో గ్రామస్తులు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీర్జంపేట-తారుపల్లి గ్రామస్తులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్ల నాటికల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఈ ఒర్రెపై బ్రిడ్జి లేకపోవడం వల్ల మీర్జంపేటలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డామని వారు గర్తు చేశారు.
మా ఇరు గ్రామాల ప్రజల ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే విజయరామరావు నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ సర్పంచులు గాజనవీణ సదయ్య, మాదాసి సతీష్, మాజీ ఎంపీటీసీ పోషాల సదానందం, మొగిలి సదానందం, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, యూత్ అధ్యక్షుడు సోన్నాయి టెంకం శివరామకృష్ణ, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, డైరెక్టర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.