Kantara Chapter 1 Trailer Update | కన్నడ నుంచి రాబోతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో ‘కాంతార: చాప్టర్ 1’ ఒకటి. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తుంది. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. వరల్డ్‌వైడ్‌గా అక్టోబర్ 02 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్ అప్డేట్ను పంచుకుంది చిత్రయూనిట్. ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12.45 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది.
ಕಾಂತಾರ ಅಧ್ಯಾಯ 1 ದರ್ಶನಕ್ಕೆ ಕ್ಷಣಗಣನೆ.
ಇದೇ 22nd, ಮಧ್ಯಾಹ್ನ 12:45ಕ್ಕೆ.
Get a glimpse into the world of #KantaraChapter1 & witness the rise of a LEGEND 🔥#KantaraChapter1Trailer on September 22nd at 12:45 PM.
Subscribe & stay tuned to: https://t.co/QxtFZcNhrG
In cinemas… pic.twitter.com/jP3amddd9f
— Hombale Films (@hombalefilms) September 19, 2025