Gadwal | హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు.. కారెక్కారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ఆ నాయకులు హెచ్చరించారు.
ధరూర్, మల్దకల్, కేటి దొడ్డి మండలాల మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, బిఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరారు. వారందరికీ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.