Harish Rao | పండుగలు వస్తే చాలు.. దండుకోవడమేనా? కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఆగ్రహం
Harish Rao | దసరాకు ప్రత్యేక బస్సుల పేరుతో అదనంగా 50 శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేస్తామని టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Harish Rao | హైదరాబాద్ : దసరాకు ప్రత్యేక బస్సుల పేరుతో అదనంగా 50 శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేస్తామని టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పండుగలు వస్తే చాలు ఆర్టీసీ బస్సు ఛార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతుండటం సిగ్గుచేటు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
పల్లె వెలుగు సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం అని నిప్పులు చెరిగారు. అదనపు సర్వీసుల పేరిట 50శాతం అదనపు ఛార్జీల దోపిడీ.. ప్రయాణికులకు పెను భారంగా మారుతున్నది. పండుగ సంబురం లేకుండా చేస్తున్నది అని ఆయన పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్‌గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుంది. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజా పాలన, ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి? అని హరీశ్‌రావు నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Tyson Naidu Teaser | మాస్ యాక్షన్ విందుతో బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ టీజర్.!
Siddipeta | పోలీసుల దిగ్బంధనంలో సిద్దిపేట.. ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

