గన్నేరువరం,ఫిబ్రవరి13 : మండలంలోని చొక్కారావుపల్లిలోని బిక్క వాగు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తాండ్ర నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేపడితే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు నిబంధనల మేరకు ఇసుకను తీసుకెళ్లాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Konda Surekha | కోర్టుకు హాజరైన కొండా సురేఖ.. 27కు విచారణ వాయిదా
Telangana | విద్యార్థినుల నిరసన.. కాంగ్రెస్ 420 హామీలపై ప్రియాంక గాంధీకి పోస్టుకార్డులు..