Students | గంగాధర, మార్చి 8 : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని కరస్పాండెంట్ పర్రెం లక్ష్మారెడ్డి, డైరెక్టర్ గుడి అనంతరెడ్డి అన్నారు. ఇవాళ గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన ఏపీజే అబ్దుల్ కలాం వంటి గొప్ప వారిని ఆదర్శంగా తీసుకొని సమ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ నర్సింగరావు, ఉషారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్