Medaram | హుజురాబాద్ టౌన్, జూలై 01 : మేడారం, రామప్ప, లక్నవరం, మల్లూరు నరసింహస్వామి ఆలయాలకు హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ నడపనున్నట్టు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6న హుజురాబాద్ డిపో నుండి ఉదయం 5:00 గంటలకు బస్సు బయలుదేరి సాయంత్రం 6:00 గంటలకు హుజురాబాద్‌కు చేరుకుంటుందని చెప్పారు.
ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ రవీంద్రనాథ్ అన్నారు. సూపర్ లగ్జరీ బస్సుకు చార్జి పెద్దలకు రూ.800/-, పిల్లలకు రూ.500/- గా నిర్ణయించబడిందని, అడ్వాన్స్ బుకింగ్ కొరకు 9959225924, 9704833971, 9247159535, 9177324963 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!