Fruit Plants | హుజూరాబాద్ టౌన్, జూలై 1 : వనమహోత్సవంలో పండ్ల మొక్కల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సూచించారు. హుజూరాబాద్‌లోని ఎంపీడీవో కార్యాలయ సమావేశమందిరంలో హుజూరాబాద్, సైదాపూర్ , శంకరపట్నం మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ.. వనమహోత్సవంలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటాలని అన్నారు. హార్టికల్చర్ ద్వారా పండ్ల మొక్కల పెంపకానికి ఎక్కువ మంది రైతులను గుర్తించి మొక్కలు అందజేయాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉప్పుల శ్రీధర్, సహాయ గ్రామీణ అభివృద్ధి అధికారి కృష్ణ, ప్లాంటేషన్ సూపర్వైజర్ సత్యనారాయణ, ఎంపీడీవోలు సునీత, యాదగిరి, కృష్ణ ప్రసాద్, మండల పంచాయతీ అధికారులు సతీష్ రావు, బసీరుద్దీన్, ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శులు, ఏపీవోలు, ఈసీలు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!