Revenue Conferences | చిగురుమామిడి, జూన్ 18 : ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులో ఆర్డీవో మహేశ్వర్‌తో కలిసి బుధవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు భూ సమస్యలు ఉండడం వల్ల ప్రభుత్వం మరోసారి వాటిని సవరించేందుకు భూభారతి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడమైందన్నారు. ఏమైనా సమస్యలు ఉన్న రైతులు ఈ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. రామంచలో మధ్యాహ్నం వరకు 130 దరఖాస్తులు రైతుల వద్ద నుండి స్వీకరించడం జరిగిందని ఈ సందర్భంగా తాసిల్దార్ రమేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ ముద్ధసాని రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అరుణ్ కుమార్, తారా దేవి, పంచాయతీ కార్యదర్శి గాజుల శ్రీలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్