సిరిసిల్ల టౌన్ మార్చి 4: పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల(Sanitation workers )సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం 26 వేల రూపాయలు అందించాలని, అలాగే ఇతర సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు కార్మికులు ధర్నా చేపట్టి కమిషనర్ సమ్మయ్యకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుల్తాన్ నర్సయ్య , కాసారపు శంకర్, రాజయ్య, బాలయ్య, దేవరాజు, భారతవ్వ, బాబా కిషన్, లక్ష్మి, నర్సవ్వ, మల్లేశం, దేవయ్య, సురేష్, శ్రీనివాస్, నరేష్, రాజు, మమత, పోషవ్వ, శంకర్, తదితరులు పాల్గొన్నారు.