వేములవాడ రూరల్: వేములవాలో (Vemulawada) రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. సిరిసిల్ల మాజీ కౌన్సిలర్, రియల్టర్ సిరిగిరి రమేశ్‌ను వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి శివారులో చంపేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్లకు చెందిన రమేశ్ గత కొంతకాలంగా వేములవాడ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే వ్యాపారంలో ఉన్న పాత తగాదాల నేపథ్యంలో నాంపల్లి శివారులో శుక్రవారం రాత్రి అతని కారులోనే కత్తితో మెడపై కోసేశారు. అనంతరం హత్య చేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. అయితే అతను చేసిన వెంచర్‌లోనే హత్యకు గురవడం గమనార్హం.