సిరిసిల్ల రూరల్, మార్చి 17 : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారని, సీఎంతో పాటు కాంగ్రెస్ నేతల తీరు కూడా మార్చుకోవాలని తంగళ్ళపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న అన్నారు. సోమవారం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చిత్రపటాలకు మండల కేంద్రంలో పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పదేళ్లపాటు కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలిపారని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అపసోపాలు పడుతుందన్నారు.
అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై మానవత్వం లేకుండా నోరు పారేసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో మాజీ ఎంపీపీ పడిగెల మానస, మాజీ ఏఎంసీ చైర్ పర్సన్ పూసపల్లి సరస్వతి, మాజీ మండల అధ్యక్షుడు ఆంకారపు రవీందర్, మాజీ జడ్పిటిసి కోడి అంతయ్య, పడి గెల రాజు, మాట్ల మధు, వల కొండ వేణుగోపాల్ రావు, బండి జగన్, ఆత్మకూరు చంటి యాదవ్, అర్కుటీ మహేష్ , బండి దేవేందర్, అబు బఖార్, క్యారం జగత్, నవీన్ రావు, భానుమూర్తి, కుంటయ్య, అమర్ రావు, ఆఫ్రోజ్, కిష్టారెడ్డి, చిరంజీవి,మోతే మహేష్ యాదవ్, రమేష్, చక్రపాణి, రామచంద్రం, నవీన్ రెడ్డి, గుండు ప్రేమ్ కుమార్, అనిల్, కొమురయ్య, తిరుపతి, రామ గౌడ్ తదితరులు ఉన్నారు.