హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : అత్యంత వెనుకబడిన 57 షెడ్యూల్డ్ కులాల(ఎంబీఎస్సీ) అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 57 ఎంబీఎస్సీ కులాల హకుల పోరాట సమితి వ్యవస్థాప క అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు. బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. సచివాలయం లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఉన్నతాధికారులను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): టైటానియం గనుల లీజులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్విట్జర్లాండ్‌కు చెందిన బౌత్లీ ట్రేడ్ ఏజీ కంపెనీతో కుదుర్చుకున్న అవగాహన ఒ ప్పందం వెనుక కుట్ర జరిగిందని అమెరికా కోర్టులో ఎఫ్‌బీఐ నమోదు చేసిన కేసులో ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కా ర్నర్ నోటీసును సవాలు చేస్తూ కాంగ్రె స్కు చెందిన మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని సీబీఐ పేర్కొన్నది. ఆ పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టులో వాదించింది. పారిస్‌లోని ఇంటర్‌పోల్ ఏజెన్సీ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినందున అకడే అప్పీలు దాఖలు చేసుకోవాలని పేర్కొన్నది.