గంభీరావుపేట : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరవులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగులో పడి ఒకరి గల్లంతయ్యారు. నర్మాల క్యాంపుకు చెందిన పంపుకాడి నాగయ్య బర్లను మేపేందుకు బుధవారం వాగు సమీపానికి వెళ్లారు. భారీ వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గల్లంతయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Sundarakanda | ‘సుందరకాండ’ రివ్యూ.. నారా రోహిత్ మూవీ ఎలా ఉందంటే.?
Road Accident | చౌటుప్పల్ రోడ్డు ప్రమాదంలో అప్పుడు ఇద్దరు డీఎస్పీలు.. ఇవాళ ఏఎస్పీ మృతి..
Vijay | స్టార్ హీరోపై తీవ్ర ఆరోపణలు.. నా ఆస్తులన్నీ పోయిన .. విజయ్ మాత్రం పట్టించుకోలేదు!