Garima agarwal | వేములవాడ, డిసెంబర్ 30 : దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగంపై రాజన్న సిరిసిల్లా జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం భీమేశ్వర సదన్‌లో ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితేలతో కలెక్టర్‌తో కలిసి అధికారుల సమన్వయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే భక్తులు ప్రతి చిన్న అవసరాలకు ప్లాస్టిక్ వాడడం ద్వారా విక్రయాలు భారీగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేములవాడ పుణ్యక్షేత్ర పట్టణంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వస్తువులు దర్శనమిస్తున్నాయని తద్వారా పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాజన్న క్షేత్రంలో కోడెమొక్కు ఎంతో పవిత్రంగా భక్తులు భావిస్తున్నారని, వేములవాడ రాజన్న క్షేత్రంలో ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు పకడ్బందీగా పని చేయాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్‌ను నియంత్రించి రాజన్న కోడెలను, పశువులను రక్షించుకుందాం అని ఆమె అన్నారు.
Sannia Ashfaq: నా ఇంటిని ముక్కలు చేశారు.. విడాకులపై పాకిస్థాన్ క్రికెటర్ భార్య ఆవేదన