ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వాసిమ్ తన భార్య సన్నియా ఆష్ఫక్(Sannia Ashfaq)కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ క్రికెటర్ గురించి భావోద్వేగ పోస్టు చేసింది సన్నియా. తన విడాకులకు మూడో వ్యక్తి కారణమని, తన ఇంటిని ముక్కలు చేసినట్లు ఆమె ఆ పోస్టులో ఆరోపించింది. సన్నియా, ఇమాద్ వాసిమ్ 2019, ఆగస్టు 26వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యగా, తల్లిగా తన బాధ్యతలకు కట్టుబడి ఉన్నట్లు ఆమె పేర్కొన్నది. కానీ ఇమాద్‌ను పెళ్లి చేసుకోవాలని భావించిన ఓ వ్యక్తి తమ రిలేషన్‌ను బ్రేక్ చేసినట్లు అష్ఫక్ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన ఆవేదనను వ్యక్త పరిచింది. ఆల్‌రౌండర్‌గా ఇమాద్ వాసిమ్.. పాకిస్థాన్ తరపున 55 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌ల్లో ఆడాడు.