నీలగిరి, డిసెంబర్ 30 : నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సయ్యద్ ముసాబ్ అహ్మద్‌కు గ్రేడ్-1 కమిషనర్‌గా పదోన్నతి రావడంతో మంగళవారం మున్సిపల్ పలు విభాగాల సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. నల్లగొండ పట్టణంలో పారిశుధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ దేశస్థాయిలో నల్లగొండ మున్సిపాలిటీకి అవార్డు తీసుకొచ్చారన్నారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడా రాజీ లేకుండా తనవంతు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ రాములు, శానిటరీ ఇన్స్పెక్టర్లు గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్‌రెడ్డి, డీఈ అశోక్, ఏఈ దిలీప్ బార్గవ్, పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.