MLA Gangula Kamalakar | ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ 10 సంవత్సరాల్లో చాలాసార్లు కరీంనగర్ జిల్లాకు వచ్చారు. ఎప్పుడొచ్చినా కూడా కరీంనగర్ జిల్లాకు నిధుల వరదను తీసుకొచ్చి ఈ జిల్లాను రాష్ట్రంలోనే గొప్ప జిల్లాగా తీర్చిదిద్దారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. కరీంగనర్ జిల్లాకు కేసీఆర్ ఎట్లా నిధులిచ్చారో.. నిన్న రేవంత్ వస్తున్నరు కదా నిధులిస్తడని భావించాం. 10 సంవత్సరాలు అభివృద్ధి పథంలో నడిపిస్తే నిన్న వచ్చిన రేవంత్ రెడ్డి ఆరోపణలు, విధ్వంసం, వ్యక్తిగత దూషణలకు పరిమితమైండని మండిపడ్డారు.
వ్యక్తిగతంగా ఎందుకు దాడి చేస్తుండని అడిగితే.. ప్రభుత్వంలో ఏం చేయనీకి చేతనైతలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. ప్రజలు 1000 రోజులు పరిపాలనలో తీవ్రంగా నిరసిస్తుంటే.. డైవర్షన్ పాలిటిక్స్ చేయాలే. లేనిపోని ఆరోపణలు చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం.. ఇది ఈ ముఖ్యమంత్రికి అలవాటైపోయింది.. మేం కూడా 15-16 సంవత్సరాలుగా నలుగురైదుగురు ముఖ్యమంత్రులను చూసినం. కేటీఆర్ 8 వేల ఎకరాలు కబ్జా చేశారు, సిరిసిల్లకు వస్తూ దానిపై ఎవిడెన్స్ తెస్తానని రేవంత్ రెడ్డి చాలా సార్లు అన్నాడు.. వచ్చేటప్పుడు తెస్తా అన్నఎవిడెన్స్ ఏది అని ప్రశ్నించారు.
నిన్న రేవంత్ రెడ్డి వచ్చిందంతా బూటకమని తేలిపోయిందన్నారు. 1000 రోజులు పరిపాలనలో 420 హామీలైతే ఎలా బూటకమో.. ఎవిడెన్స్ తేలేకపోయిర్రు కాబట్టి కేటీఆర్ మీద చేసిన ఆరోపణలు కూడా బూటకమని నిన్న తేలిపోయిందని పేర్కొన్నారు.
కేటీఆర్ 8 వేల ఎకరాలు కబ్జా చేశాడు, సిరిసిల్లకు వస్తూ దానిపై ఎవిడెన్స్ తెస్తానని రేవంత్ రెడ్డి అన్నాడు
ఏది ఎవిడెన్స్? నీ ఆరోపణలన్నీ బూటకమని తేలిపోయింది
– ఎమ్మెల్యే గంగుల కమలాకర్ pic.twitter.com/vXUTEgcBxU
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026
butterflies | రంగురంగుల సీతాకోకచిలుకలు, వాటర్ బర్డ్స్ సందడి చూశారా..? వీడియో
Dorothy | రానా సమర్పణలో కార్తీక్ సుబ్బరాజు గే లవ్‌స్టోరీ ‘డోరతీ’.. తెలుగు ట్రైలర్ రిలీజ్
Helicopter crash | జింబాబ్వేలో హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి