సిరిసిల్ల టౌన్, మే 7: మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఅర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాతనే సిరిసిల్ల పర్యటన చేపట్టాలని, లేనిపక్షంలో సిరిసిల్లలో పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
రాజకీయాల్లో విమర్శలు హద్దులు దాటకూడదని, వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడటం ప్రజలు సహించరని అన్నారు. వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.