KTR | తరం మారుతుంది, స్వరం మారుతుంది..జెన్జెడ్తో(Gen-Z) ప్రధాని మోదీ(PM Modi) జాగ్రత్తగా ఉండు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. బర్త్ డే వేడుకలను సైతం రద్దు చేసుకుని, నల్ల చొక్కాతో ఆయన నిరసన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
నేపాల్లో యువత తలుచుకుంటే ప్రభుత్వమే కూలిపోయిందని గుర్తు చేశారు. ఈడీ, సీబీఐలకు భయపడి సోనమ్ వాంగ్చుక్ దీక్షను ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ విద్యార్థులు మాకు సోషల్ మీడియా ఉందని ధైర్యంగా పోరాడుతున్నారు. కేంద్రంపై నిరసన కోసం వస్తుంటే మధ్యలో కాంగ్రెస్ వాళ్లు మమ్మల్ని అడ్డుకున్నారు. బడే భాయ్ కోసం చోటే భాయ్ అడ్డం పడుతున్నాడు. మోదీని అంటే ఈ కేడీ గాడికి ఏం అయింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి మోదీ ఇంటి ముందు కూర్చుంటే.. ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది అని ఎద్దేవా చేశారు.
రేప్ కేసులలో బీజేపీ నాయకుల కొడుకులకు బెయిల్ వస్తుంది కానీ మాకు న్యాయం ఎందుకు జరగడంలేదని విద్యార్థులు అడుగుతున్నారు. 8 మంది బీజేపీ ఎంపీల్లో ఎవరైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారా? అని ప్రశ్నించారు. మాట్లాడితే బీజేపీ వాళ్లు దేశం కోసం ధర్మం కోసం అంటారు. దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న ఈ పిల్లలు హిందువులు కాదా? అని నిలదీశారు. అవసరమైతే మీకోసం కేసీఆర్ కూడా వస్తాడు. ఆయన సోషల్ మీడియాలో మీ ఆందోళన చూసి తల్లడిల్లిపోతున్నాడని తెలిపారు. పిల్లలే దేశ ముఖచిత్రాన్ని మారుస్తారు, వాళ్లే ఈ దేశాన్ని కాపుడుకుంటారని కరోనా సమయంలోనే కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తరం మారుతుంది, స్వరం మారుతుంది మోడీ.. జాగ్రత్తగా ఉండు
నేపాల్లో యువత తలుచుకుంటే ప్రభుత్వమే కూలిపోయింది
ఈడీ, సీబీఐలకు భయపడి సోనమ్ వాంగ్చుక్ దీక్షను ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేదు
కానీ విద్యార్థులు మాకు సోషల్ మీడియా ఉందని ధైర్యంగా పోరాడుతున్నారు
నువ్వు అనవసరంగా GenZ తరంతో… https://t.co/609MoMe7OJ pic.twitter.com/kome2FdJhs
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2026
కేంద్రంపై నిరసన కోసం వస్తుంటే మధ్యలో కాంగ్రెస్ వాళ్లు మమ్మల్ని అడ్డుకున్నారు
బడే భాయ్ కోసం చోటే భాయ్ అడ్డం పడుతున్నాడు
మోడీని అంటే ఈ కేడీ గాడికి ఏం అయింది
ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి మోడీ ఇంటి ముందు కూర్చుంటే.. ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది
– కేటీఆర్ https://t.co/fIGCQpjwi1 pic.twitter.com/Qov5AjoBtG
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2026
రేప్ కేసులలో బీజేపీ నాయకుల కొడుకులకు బెయిల్ వస్తుంది కానీ మాకు న్యాయం ఎందుకు జరగడంలేదని విద్యార్థులు అడుగుతున్నారు
8 మంది బీజేపీ ఎంపీల్లో ఎవరైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారా?
దేశం కోసం ధర్మం కోసం అంటారు, ఈ పిల్లలు హిందువులు కాదా?
– కేటీఆర్ https://t.co/3dOQCputZe pic.twitter.com/cBkm3Zhfkp
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2026