Trinette Faint | గూగుల్ తొలగించింది.. ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది
Trinette Faint | గూగుల్‌లో ఉద్యోగం చేసింది. 2 లక్షల డాలర్ల జీతం అందుకుంది. ఆ సంస్థ అనుకోకుండా ఆమెను ఆ ఉద్యోగం నుంచి తొలగించింది. ఎవరైనా ఏం చేస్తారు. చాలా బాధపడతారు. కానీ ఈమె మాత్రం కొంచెం కూడా బాధపడలేదు.
Trinette Faint | గూగుల్‌లో ఉద్యోగం చేసింది. 2 లక్షల డాలర్ల జీతం అందుకుంది. ఆ సంస్థ అనుకోకుండా ఆమెను ఆ ఉద్యోగం నుంచి తొలగించింది. ఎవరైనా ఏం చేస్తారు. చాలా బాధపడతారు. కానీ ఈమె మాత్రం కొంచెం కూడా బాధపడలేదు. సినిమా రంగంలోకి ప్రవేశించి నిర్మాతగా, నటిగా ఎదిగింది. అవార్డు గెలుచుకుంది. అందరితో శెభాష్ అనిపించుకున్న ఆమె పేరు ‘ట్రినెట్ ఫెయింట్’.
వృత్తి జీవితం
1990లో ఒక సంస్థలో ప్రొడక్షన్లో పర్సనల్ అసిస్టెంట్‌గా వృత్తి జీవితం ప్రారంభించారు ట్రినెట్ ఫెయింట్. 2011లో న్యూయార్క్‌లోని రస్సెస్ రెనాల్డ్స్ అసోసియేట్స్‌లో యూఎస్ పేరోల్ మేనేజర్‌గా, ట్రావెల్ మేనేజర్‌గా, సీఈవోకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. తర్వాత నైక్ కంపెనీలో కూడా అదో హోదాలో ఉద్యోగం చేశారు. అనంతరం ఒక ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్‌కు కాపీరైటర్‌గా, ఎడిటర్‌గా పని చేశారు.
గూగుల్‌లో ఉద్యోగం
ట్రెనెట్ గూగుల్‌లో 2018 నుంచి 2024 వరకు ఎగ్జిక్యూటివ్ బిజినెస్ పార్ట్నర్గా పని చేశారు. ఆ సమయంలో ఆమె రెండు లక్షల డాలర్ల (సుమారు రూ. 1.93 కోట్లు) వేతనం అందుకున్నారు. ఉద్యోగం కోల్పోయిన అనంతరం ఆమె మోకాలికి ఆపరేషన్ జరగడం, పెంపుడు కుక్క ఏవరీ చనిపోవడంతో కొంత మానసిక ఒత్తిడికి లోనయ్యారు. అయినా కుంగిపోకుండా 2024, డిసెంబర్లో ఫిల్మ్‌మేకర్‌గా, నటిగా మారారు. ఆమె గురించి ‘బిజినెస్ ఇన్సైడర్(Business Insider)’ అనే పత్రిక ఒక వ్యాసం ప్రచురించింది. దీంతో ప్రపంచానికి ఆమె పేరు పరిచయమైంది.
తను రాసిన కథే తనకు జరిగింది
గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విదేశీ పర్యటనలో భాగంగా లండన్‌కు వెళ్లాలనుకున్నారు. అంతకుముందు ఆమె టెక్ ఉద్యోగాన్ని కోల్పోయిన మహిళ గురించి ఓ టీవీ కోసం ‘పెరీ డస్ యూరోప్’ అనే ఒక స్క్రిప్ట్ రాశారు. ఆ కథ రాసిన 24 గంటల్లో పర్యటనకు వెళ్లేముందు ఆమె ఉద్యోగం కోల్పోయారు. తను రాసిన కథ తనకే జరగడం గమనార్హం. గూగుల్ నుంచి లభించిన పరిహారం, వ్యక్తిగత పొదుపు డబ్బులను వృథాగా ఖర్చుచేయకుండా తను అనుకున్న రంగంవైపు మళ్లారు.
నటన కోసం శిక్షణ
ఫ్రాన్స్‌లో నటనపై కోచింగ్ తీసుకున్నారు. యాక్టర్ మాట్ డామన్ (Matt Danon)కు పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. టీవీ, ఇతర వాటికి స్క్రీన్ ప్లేలు రాయడం మొదలుపెట్టారు. సౌత్ బై సౌత్‌వెస్ట్ అనే సంస్థ సినిమా, టెలివిజన్, టెక్నాలజీ, మ్యూజిక్, ఎడ్యుకేషన్, కల్చర్, గేమింగ్ తదితర సృజనాత్మక రంగాలపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ సంస్థ టెక్సాస్, లండన్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆమె తను రాసిన స్క్రీన్‌ప్లేలను ప్రజెంట్ చేశారు.

Party Pants
అవార్డు
ఆమె ‘పార్టీ ప్యాంట్స్ (Party Pants)’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశారు. దీనిలో ఆమె నటించడంతో పాటు నిర్మించారు. ఈ షార్ట్‌ఫిల్మ్ బెర్లిన్ ఇండీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును ఆమె అందుకున్నారు. ఓ టీవీ కోసం ‘కొల్లేట్స్ కాలెబ్ (Collette’s Caleb)’ అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. అలాగే కళాకారుల కోసం ఆమె ‘చెజ్ ఫెయింట్ (Chez Faint) అనే నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. కార్పొరేట్ ఉద్యోగం కంటే ఈ పనిలోనే సంతృప్తిగా ఉన్నానని, మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చని అవార్డు అందుకున్న సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

