NEET paper leak | పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు.. మూడు నెలల్లో విచారణ : కేంద్రం
NEET paper leak : కొత్తగా రూపొందించనున్న చట్టాల ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే, మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలి. నిందితులకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు.
NEET paper leak : నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సీజేపీ చేపట్టిన ఆందోళనతో ఈ అంశానికి జాతీయస్థాయిలో ప్రచారం లభించింది. ఈ అంశంలో కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పేపర్ లీకేజీని కేంద్రం సీరియస్గా తీసుకుంది. పేపర్ లీకేజీని అరికట్టేందుకు కఠిన చట్టాలు రూపొందించనుంది. కొత్తగా రూపొందించనున్న చట్టాల ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే, మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలి.
నిందితులకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న చట్టాలకు కీలక సవరణలు చేస్తూ కొత్త చట్టాన్ని కేంద్రం రూపొందిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ శుక్రవారం ప్రకటించారు. జవాబుదారీతనం ఉండేలా, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందిస్తామన్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశంపై ఒక వీడియో విడుదల చేశారు. పేపర్ లీకులను అరికట్టేలా కఠిన చట్టాలు తెస్తామని, దీనిపై కేంద్ర క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటికే పేపర్ లీకులపై విచారించేందుకు ఢిల్లీ కోర్టుల ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటవ్వగా మరో నాలుగు కోర్టులను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం కొత్తగా తీసుకురానున్న చట్టం ప్రకారం.. పేపర్ లీకే కేసులను త్వరితగతిన విచారిస్తారు.
అది కూడా నిర్దిష్ట కాలపరిమితితో. ప్రతి రోజూ విచారణ జరుగుతుంది. ఈ కేసులను త్వరగా విచారిం, దోషులకు త్వరగా శిక్ష పడేలా చేస్తారు. ఇప్పటికే పేపర్ లీకేజీలకు సంబంధించి కొన్ని చట్టాలున్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం పేపర్ లీకేజీకి పాల్పడిన దోషులకు మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. ఈ కేసులో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే, ఈ శిక్షలను కొత్త చట్టంలో పెంచనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లోనే.. అది కూడా వచ్చే వారమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

