కొడిమ్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కొడిమ్యాల మండలం అప్పరావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..అప్పారావుపేట గ్రామానికి చెందిన బందరు రాజయ్య (65) అప్పరావుపేట నుంచి పూడూరు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఈ క్రమంలో రైలు ట్రాక్ దాటుతుండగా.. పూడూరు నుంచి కొడిమ్యాల వైపు వస్తున్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇంచార్జి ఎస్ ఐ పురుషోత్తం ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.