Vemulawada : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మరణించిన వ్యక్తి గెలుపొందారు. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ టాన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి (Cherla Murali) భారీ తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించారు. నామినేషన్ వేసి గెలుపుపై ధీమాతో ఉన్న మురళి డిసెంబర్ 5వ తేదీన హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. డిసెంబర్ 11 గరువారం ఎన్నికలు జరుగగా.. మురళి భౌతికంగా లేకున్నా సరే చింతల్ టాన ప్రజలు మాత్రం జై కొట్టారు.
బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి ప్రత్యర్థిపై 370 ఓట్లతో గెలుపొందారు. మొత్తం 1717 ఓట్లు పోలవ్వగా.. బీఆర్ఎస్ బలపరిచిన చెర్ల మురళికి 739 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సురువు వెంకటికి 369 ఓట్లు, కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కోలాపురి రాజమల్లుకు 333 ఓట్లు వచ్చాయి.