సిరిసిల్ల రూరల్, మార్చి 12 : పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న ఆకాంక్షించారు. పదో తరగతి ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం తంగళ్లపల్లి మండలం మండేపల్లి లోని మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా అందించిన పరీక్ష ప్యాడ్, పెన్నులను సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, మాజీ ఎంపీపీ పడి గెల మానస, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, పార్టీ నేతలతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్కు విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పడిగేల రాజు, అలువాల సాయి, జక్కని రమేష్, సదుల భాస్కర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Mufasa The Lion King OTT | ఓటీటీలోకి ‘ముఫాసా ది లయన్ కింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Watch: మార్కెట్ రోడ్డులోకి దూసుకొచ్చిన వాహనం.. తర్వాత ఏం జరిగిందంటే?