లక్నో: రద్దీగా, ఇరుకుగా ఉన్న మార్కెట్ రోడ్డులోకి ఒక వాహనం దూసుకొచ్చింది. (SUV rams) అక్కడ పార్క్ చేసిన పలు బైకులను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో అక్కడున్న జనం షాక్ అయ్యారు. ఆ వాహనం నుంచి తప్పించుకునేందుకు పక్కలకు పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 10న నోయిడాలోని సెక్టార్ 16లో మార్కెట్ ప్రాంతంలోని రోడ్డులోకి రాంగ్ రూట్లో ఎస్యూవీ వాహనం దూసుకొచ్చింది. అక్కడ పార్క్ చేసిన పలు బైకులను అది ఢీకొట్టింది. ఒక సైన్ బోర్డును ఢీకొట్టగా అది పడిపోయింది. ఆ వాహనం అంతే వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాగా, మార్కెట్ ప్రాంతంలోని జనం ఇది చూసి షాక్ అయ్యారు. దూసుకొస్తున్న వాహనం నుంచి తప్పించుకునేందుకు దూరంగా పరుగెత్తారు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. వాహనం డ్రైవర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#नोएडा :- थार गाड़ी लेकर अज्ञात व्यक्ति ने सड़क पर मचाया आतंक, कई गाड़ियों को मारी टक्कर, गनीमत रही कि कोई घायल नहीं हुआ, नोएडा के थाना फेज-1 के सेक्टर 16 का मामला।#Noida #UttarPradesh #stunt
#Thar #republicnow #UPPolice pic.twitter.com/Ut7nlw7S27— REPUBLIC NOW (@republicnownews) March 12, 2025