Jeevan reddy | వేములవాడ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్, బీఆర్ెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి హామీలపై ఫైర్ అయ్యారు. వేముల వాడ నియోజకవర్గంలోనే రాష్ట్రంలో ఎక్కడైనా అదనపు తూకం లేకుండా ధాన్యం సేకరణ చేసింది ఉందా.. అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో రూ. 200 ఉన్న పెన్షన్ను రూ.2 వేలు చేసిండు. నువ్వు రూ.2 వేలను రూ.4 వేలు చేస్తా అంటున్నవ్. ఆ రూ. 4వేలు కాదు.. ఆ రూ.2 వేలు అసలైన అర్హత ఉన్నవారికి ఇయ్యాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ఒక మాటన్నడు. ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులను చేస్తా అన్నడు. కోటీశ్వరులను వద్దురా.. నాయనా ముందు లక్షాధికారులను చేయాలని జీవన్ రెడ్డి అన్నారు. ప్రతీ ఆడబిడ్డలకు రూ. 2500 ఇస్తా అన్నడు. అంటే 12 మాసాలకు రూ.30 వేలు అంటోంది. 5 సంవత్సరాలకు లక్షా 50 వేలు అవుతది. మాకు కోటి వద్దు.. మీరు చెప్తున్న 2500 ఉందో ఐదేళ్లకు సరిపడా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాపం ఆడబిడ్డ మీనాక్షి నటరాజన్ ఏదో పార్టీని బాగు చేస్తామని వస్తే ఆమెను కూడా బలితీసుకున్న దుర్మార్డుడు రేవంత్ రెడ్డి అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడం కాదు ముందు చెప్పిన హామీ ప్రకారం నెలకు రూ.2500 ఇవ్వురా నాయన
– మాజీ మంత్రి జీవన్ రెడ్డి https://t.co/Hb5yR3JAmy pic.twitter.com/kU9jYi1NMQ
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2026