న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఇవాళ విపక్షాలు పార్లమెంట్(Parliament)లో ఆందోళన చేపట్టాయి. నీట్ పేపర్ లీకేజీ ఘటన నేపథ్యంలో విపక్షాలు ఈ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ, రాజ్యసభలోనూ ఇదే సీన్ రిపీటైంది. లోక్‌సభలో విపక్ష ఎంపీలతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రధాన్ రాజీనామా కోరుతూ సభలో నినాదాలు చేశారు. విపక్ష ఎంపీలు తగ్గకపోవడంతో.. సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. మళ్లీ సోమవారం లోక్‌సభ సమావేశంకానున్నది.
మరో వైపు రాజ్యసభ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ అంశంపై ఇవాళ విపక్షలు చర్చకు పట్టుపట్టాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేశారు. తొలుత 12 గంటలకు సభ వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ విపక్ష సభ్యులు ప్రధాన్ రాజీనామాకు పట్టుపట్టారు. దీంతో 2 గంటల వరకు వాయిదా వేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.
లోక్‌సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. నీట్‌పై చర్చ జరగాలని విపక్షాలతో చెప్పానని, దేశ ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, సోనమ్ వాంగ్చెక్ తన నిరాహార దీక్షను విరమించారని, ఆయన కూడా సభలో చర్చ జరగాలని ఆశించారని, ఒకవేళ ఇప్పుడు చర్చ చేపట్టకుంటే, అది సరైన సందేశాన్ని ఇవ్వబోదు అని మంత్రి రిజిజు అన్నారు.