Pellet Guns: సీజేపీ నిరసనకారుడికి గాయాలు.. పెల్లెట్ గన్స్ వాడకంపై సీఆర్పీఎఫ్ దర్యాప్తు
Pellet Guns: సీజేపీ కార్యకర్త ఛాతిపై పెల్లెట్స్ గాయాలు కనిపించాయి. దీంతో నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ పోలీసులు తాము పెల్లెట్ గన్స్ వాడమని చెప్పేశారు. ఇక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏమైనా ఆ పెల్లెట్స్ వాడి ఉంటుందా అన్న కోణంలో దర్యాప్తు జరగనున్నది.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం జరిగిన పార్లమెంట్ మార్చ్ లో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఓ వ్యక్తి ఛాతిపై పెల్లెట్స్ గాయాలు ఉన్నాయి. దీంతో నిరసనకారులపై పెల్లెట్ గన్స్(Pellet Guns) వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టగా, ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. నిరసనకారులపై పెల్లెట్స్ వాడలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఆ రోజు విధుల్లో ఉన్న ఆర్ఏఎఫ్ ఆ పెల్లెట్స్ వాడినట్లు అనుమానిస్తున్నారు.
పెల్లెట్ గన్స్‌తో పాటు షాక్ బాటన్‌ను ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాడుతోంది. అయితే నిరసన ప్రదర్శన వేళ ఢిల్లీ పోలీసులతో పాటు ఆర్ఏఎఫ్ కూడా జంతర్ మంతర్ వద్ద విధుల్లో ఉన్నది. అల్లరి మూకలను అరికట్టేందుకు ఆర్ఏఎఫ్ దళాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇది సీఆర్పీఎఫ్కు చెందిన యూనిట్. అయితే ఆ పెల్లెట్స్ గాయాలు ఎలా అయ్యాయి, నిరసనకారులపై ఎవరు పెల్లెట్స్ వాడారన్న కోణంలో దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఆర్పీఎఫ్ పేర్కొన్నది.
🚨 FACT CHECK 🚨Claims stating that Delhi Police forces used pellet guns against peaceful protesters yesterday are completely false and misleading.Delhi Police neither possess pellet guns nor do they use them in the ongoing protest.The public is requested not to share or…
— Delhi Police (@DelhiPolice) July 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

