Ram Charan| రామ్ చరణ్‌కు సర్జరీ .. RC17 మరింత ఆలస్యం కానుందా, ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
Ram Charan| మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటే తెలుగు సినీ అభిమానులకు వెంటనే గుర్తుకు వచ్చేది బ్లాక్‌బస్టర్ చిత్రం రంగస్థలం. ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, నటుడిగా రామ్ చరణ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.
Ram Charan| మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటే తెలుగు సినీ అభిమానులకు వెంటనే గుర్తుకు వచ్చేది బ్లాక్‌బస్టర్ చిత్రం రంగస్థలం. ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, నటుడిగా రామ్ చరణ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ‘చిట్టిబాబు’ పాత్రలో చరణ్ కనబరిచిన నటన ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న RC17 ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను సుకుమార్ వేగవంతం చేసినట్లు సమాచారం. కథ, పాత్రల రూపకల్పన, టెక్నికల్ టీమ్ ఎంపిక వంటి అంశాలపై దర్శకుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ ఇటీవల విడుదలైన ‘పెద్ది’ సినిమాతో కెరీర్లో మరో భారీ విజయాన్ని అందుకున్నారు.
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే రూ.345 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా చరణ్ నటన, పాత్రలో ఆయన చూపించిన వైవిధ్యం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే ‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్లు, కఠినమైన స్పోర్ట్స్ సీక్వెన్స్‌ల చిత్రీకరణలో పాల్గొనడం వల్ల ఆయనకు కొన్ని స్వల్ప గాయాలు అయినట్లు ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వాటి నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొంతకాలం షూటింగ్‌లకు దూరంగా ఉండాలని చరణ్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో మరో వార్త కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ ఒక చిన్న సర్జరీ చేయించుకోనున్నారని, అనంతరం వైద్యుల సూచనల మేరకు కొన్ని నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకునే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే ఆయన కొత్త ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించే పరిస్థితి లేదని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో RC17 ప్రాజెక్ట్ షెడ్యూల్‌పై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు మరింత ఆలస్యం కావచ్చని సమాచారం. తాజా అంచనాల ప్రకారం సినిమా ప్రారంభోత్సవం 2027 జనవరి లేదా ఆ తర్వాత జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఒకవేళ ఇదే నిజమైతే 2027లో కూడా రామ్ చరణ్ నుంచి కొత్త సినిమా విడుదల కావడం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు. ఫలితంగా అభిమానులు తమ అభిమాన హీరోను వెండితెరపై మళ్లీ చూడాలంటే 2028 వరకు వేచి చూడాల్సి రావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- peddi
- ram charan
- RC 17
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

