ఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీలోని పదిహేడు మెట్రో స్టేషన్లను(Delhi metro )వరుసగా మూడో రోజు కూడా మూసివేశారు. రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్ఛేంజ్ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది.
కాగా, మెట్రో స్టేషన్ల మూసివేత వల్ల కార్యాలయాలకు వెళ్లేవారు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మెట్రో స్టేషన్ల మూసివేత వల్ల కోర్టులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేసింది.