Aashirwad: 87 బంతుల్లో 103 రన్స్.. రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ సోదరుడు
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ స్టయిల్లోనే అతని తమ్ముడు ఆశీర్వాద్ రెచ్చిపోయాడు. బీహార్ లోకల్ క్లబ్లో అతను సెంచరీ కొట్టాడు. 87 బంతుల్లో 103 రన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో తమ్ముడు ఆశీర్వాద్‌కు వైభవ్ సూర్యవంశీ తన సోషల్ మీడియాలో కంగ్రాట్స్ తెలిపారు.
పాట్నా: అన్న స్టయిల్లోనే తమ్ముడు కూడా రెచ్చిపోతున్నాడు. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్(Aashirwad) కూడా తన బ్యాట్‌తో అలరిస్తున్నాడు. సమస్తిపూర్‌లో జరిగిన ఓ లోకల్ మ్యాచ్‌లో.. ఆశీర్వాద్ సూపర్ సెంచరీ కొట్టేశాడు. ఒకవైపు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ మ్యాచ్‌లపై దృష్టి పెడుతుండగా, ఇక అతని తమ్ముడు ఆశీర్వాద్ రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తున్నాడు. తాజ్పూర్ క్రికెట్ అకాడమీ తరపున ఆడుతున్న ఆశీర్వాద్ 87 బంతుల్లో 103 రన్స్ చేశాడు. దాంట్లో 20 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. అతను 118.39 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఆశీర్వాద్ సెంచరీ కొట్టిన తర్వాత .. సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీ తన సోదరుడికి కంగ్రాట్స్ చెప్పాడు.
మరో వైపు జాతీయ జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ ఫ్యామిలీపై ప్రశంసలు కురుస్తున్నాయి. గ్రామస్థులు ఇంటికి వచ్చి విషెస్ చెబుతున్నారని, స్వీట్లు.. లడ్డూలు పంచుతున్నారని తండ్రి సంజీవ్ సూర్యవంశీ తెలిపారు. ఇంటి వద్ద బాణాసంచా కూడా కాల్చామన్నార. చిన్నతనం నుంచి వైభవ్ చాలా కష్టపడ్డాడని, దేశం కోసం ఆడాలన్న తపన అతనిలో ఉందన్నాడు. అతని కష్టానికి ఫలం దక్కిందని, దేశానికి ఆడే సౌభాగ్యం వచ్చిందన్నాడు. వైభవ్ సక్సెస్ పట్ల చాలాచాలా సంతోషంగా ఉందన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

