Jeevan Reddy | రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఒకరికొకరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు.. మా జోడీ మళ్లీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పుకుంటున్నరు. అసలు మీ జోడీ రాబోయే ఎన్నికల వరకు ఉంటదా..? అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు రాబోయే ఎన్నికల్లో పీసీసీ ప్రెసిడెంట్ ఎవరుండేది ఆయనకే తెల్వది.. ముఖ్యమంత్రి ఎవడుంటడో ఈయనకే తెల్వది.. వీళ్లు జోడీ అట. చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది.. మీ జోడీ, మీ పేర్లు చూసి ఓట్లేసేటోడున్నట్టైతే 2023 ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో 7 నియోజకవర్గాలుంటే ఒక్కటైనా గెలిచినవా.. నువ్వు రేవంత్ రెడ్డి అని అడిగారు. నీ మొఖం చూసి గెలిపించేటోడు ఉంటే నువ్వు మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవ్.. ఆ 7 నియోజకవర్గాల్లో ఒక్కటైనా గెలివాలి కదా జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు మా జోడీ మళ్లీ అధికారంలోకి రాబోతుంది అని ఒకరికొకరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు
అసలు మీ జోడీ రాబోయే ఎన్నికల వరకు ఉంటదా?
ఈ జోడీ మొహం చూసి ఓట్లు పడితే, రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్లోని 7 ఎమ్మెల్యే సీట్లల్లో… pic.twitter.com/BvNESKUfAG
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026
butterflies | రంగురంగుల సీతాకోకచిలుకలు, వాటర్ బర్డ్స్ సందడి చూశారా..? వీడియో
Dorothy | రానా సమర్పణలో కార్తీక్ సుబ్బరాజు గే లవ్‌స్టోరీ ‘డోరతీ’.. తెలుగు ట్రైలర్ రిలీజ్
Helicopter crash | జింబాబ్వేలో హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి