వేములవాడ రూరల్ : రైతుకు యూరియా (Urea)ఎరువు ఇవ్వకపోవడంతో గ్రోమోర్ దుకాణం ఎదుట ఓ రైతు నిరసన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం వద్ద ఓ రైతు నిరసన చేపట్టాడు. గ్రోమోర్ దుకాణదారుడు రైతులకు యూరియా ఇవ్వకుండా వారికి తెలిసిన వారికే అమ్ముతున్నాడని ఆరోపించారు. రైతులు అడుగుతే స్టాక్ లేదని వెనక్కు పంపిస్తూ రైతులపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఓ రైతు వాపోయాడు.
ఈ విషయాన్ని అక్కడి రైతు మండల వ్యవసాయ అధికారి సాయికృష్ణ దృష్టికి తీసుకెళ్లాడు. ఇదే విషయంపై ఇరువురు మధ్య వాగ్వివాదం జరగడంతో ఏవో సమస్య సద్దుమనిగేలా చేశారు. ఈ విషయంపై గ్రోమోర్ నిర్వాహకుడిని వివరణ కోరగా యూరియా కొరత ఉందని, రైతులందరినీ సమానంగానే చూస్తున్నామని తెలిపారు. రైతు 10 బస్తాల యూరియా అడగడంతో ఇవ్వలేకపోయామన్నాడు.