Congress Leaders | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 29 : కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో నేతల మధ్య గందరగోళం నెలకొనడం సాధారణంగా కనిపించేదే. పార్టీలో నేతల మధ్య ఉన్న విభేదాలు ఏదో ఒక మీటింగ్లో బహిర్గతమవడం తరచూ కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి ఘటనే సిరిసిల్ల కాంగ్రెస్ మీటింగ్లో చోటుచేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమేష్ రావు మాట్లాడుతుండగా సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి అనుచర వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో స్థానిక నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
జిల్లా కేంద్రంలోని లహరి కల్యాణ మండపంలో ఇవాళ జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులున్నప్పటికీ ఓడిపోతున్న నాయకులకే టికెట్లు ఇస్తున్నారని ఉమేష్ రావు వ్యాఖ్యానించడంతో మరో వర్గం నాయకులు ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేదికపైకి దూసుకురావడంతో సమావేశం పూర్తిగా రసాభాసాగా మారింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలగజేసుకొని కాంగ్రెస్ నేతలను నచ్చజెప్పినప్పటికీ నాయకులు చాలా ఆందోళన చేశారు. జిల్లా, రాష్ట్ర పరిశీలకుల ఎదుటే కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగడం చర్చనీయాశంగా మారింది.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి