Congress leaders | వేములవాడ, జనవరి 21: ఇప్పుడేమీ పండగ లేదు, కానీ ఓట్ల పండుగ ఉంది కదా అందుకే కాంగ్రెస్ నాయకులకు మహిళలు గుర్తుకు వచ్చారు. 2500 రూపాయల హామీ ఇవ్వరుగాని పండుగలు అన్ని పోయాక చీరలు మాత్రం ఇస్తూ మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో కాంగ్రెస్ నేతలు అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హం.
వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని శత్రాజ్ పల్లిలో మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళలకు బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంగ స్వామి మరికొందరు నేతలతో కలిసి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో అధికారులు పాల్గొనాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలే నేరుగా చీరల పంపిణీ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ నేతలకు ఎన్నికల అప్పుడే హామీలు గుర్తుకు వస్తాయని, ఇస్తామన్న 2500 రూపాయల భృతి, విద్యార్థులకు స్కూటర్లు, రూ.500 గ్యాస్ సబ్సిడీ అందించి నిజాయితీ చాటుకోవాలని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు లేకుండానే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతల తీరుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Ramagiri : ‘పీజీ పరీక్ష ఫీజు గడువును పొడిగించాలి’
Jharkhand: ఏనుగు బీభత్సం.. 22 మంది మృతి.. జార్ఖండ్‌లో ఎమర్జెన్సీ
Rachel McAdams | రాచెల్ మెక్‌ఆడమ్స్‌కు అరుదైన గౌరవం.. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు