Vemulawada Goshala | వేములవాడ, జూన్ 1 : వేములవాడ రాజన్న ఆలయ గోశాల నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం ద్వారా కోడేలు పిట్టల్లా రాలిపోయాయని ఇందుకు కారణమైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.
ఆదివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా చీమ చిటుక్కుమన్నా మాట్లాడే స్థానిక శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ కోడెలు మృత్యు పడుతున్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గత ఆరు మాసాల క్రితం మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సిఫారసు లేకతో ఒకరికి 60 కోడెలు కేటాయించడం ద్వారా ఈ పంపిణీ ఆగిపోయిన విషయం తెలిసిందే అని చెప్పారు.
తెలంగాణలోని ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ముందుగా రాజన్నకు మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీలో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి కోడెలు సమర్పిస్తున్నారని తెలిపారు. మరో వైపు గుడి బంద్ చేస్తారన్న ప్రచారంలో భాగంగా భక్తులు ప్రతినిత్యం వేలాదిగా తరలివస్తూ అత్యంత ప్రీతిపాత్రమైన స్వామివారికి నిజ కూడిన కూడా భక్తులు సమర్పించుకుంటున్నారని తెలిపారు. ఆరు మాసాలుగా కోడెల పంపిణీ ప్రక్రియ నిలిచిపోగా, దీంతో తిప్పాపూర్ గోశాలలో కేవలం 500 కోడెలు మాత్రమే ఉంచే స్థలంలో 1200కు పైగా కోడెలను ఉంచడం ద్వారా అనారోగ్యం బారిన పడి సరియైన ఆహారం అందక మృత్యువాత పడుతున్నాయన్నారు.
సాక్షాత్తు పశు వైద్యాధికారులే నిర్ధారించడం దురదృష్టకరమన్నారు. స్వామివారికి అత్యంత ప్రతిపాత్రమైన కోడె మొక్కు ద్వారా సాలిన 22 కోట్ల ఆదాయం వస్తుండగా కనీసం వాటికి ఆహారం పెట్టలేని దుస్థితిలో రాజన్న ఆలయ అధికారులు, ఈ ప్రభుత్వం ఉండడం దురదృష్టకరం అన్నారు. 500 చోట 1200కు పైగా కోడేలు ఉండడం.. కనీస ఆహారం లేక మృతి చెందడంలో అధికారులకు నాయకులకు కనీస మానవత్వం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా..?
అసలు రాజన్న కోడెలకు ఎంతమంది సిబ్బంది పని చేస్తున్నారు, ఏమైనా వైద్య సదుపాయాలు కల్పించి మందులు కొనుగోలు చేశారా..? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. చనిపోయిన తర్వాత మాత్రమే అధికారులు హడావిడి చేస్తూ పంపిణికి సిద్ధమవుతున్నట్లు కలెక్టర్ ప్రకటన చేస్తున్నారు. గతంలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా పకడ్బందీగా పంపిణీ జరగాలని సూచించారు.
ఇకపై రాజన్న కోడెలకు శాశ్వత పరిష్కారంగా 50 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి వాటిని కాపాడి భక్తుల మనోభావాలను గౌరవించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే భక్తుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. రాజస్థాన్ ప్రాంతంలో 2వేల ఎకరాల్లో లక్ష 50 వేల గోవులను సంరక్షిస్తున్నారని అక్కడిలాంటి ప్రదేశాలకు వెళ్లి అధ్యయనం చేసి కాపాడాలని సూచించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, క్రాంతి కుమార్, రామతీర్థపు రాజు, నరాల శేఖర్, సిరిగి రామచందర్, నిమ్మ శెట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, గోలి మహేష్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, ఈర్లపల్లి రాజు, ముద్ర కోల వెంకటేశం, నరాల దేవేందర్, నీలం శేఖర్, మల్లేశం, రాజు, పోతు అనిల్, సందీప్ తదితరులు ఉన్నారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!