సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 6 : బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత చిలుక రఘువర్మ (35) (Raghu Varma) హఠాన్మరణం చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన రఘువర్మ గురువారం రాత్రి గుండెపోటు రావడంతో ఇంట్లోనే మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రఘువర్మ, గురువారం రాత్రి ఇంట్లోనే తుది శ్వాస విడిచాడు. రఘువర్మ మృతి వార్త తెలియడంతో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజ భింకార్ రాజన్న, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, పడిగెల రాజు, బండి జగన్, కొయ్యాడ రమేష్, మాట్ల మధుతో పాటు పార్టీ నేతలు చేరుకొని భౌతిక కయానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. రఘువర్మ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కాగా రఘువర్మ 2009 నుంచి కేటీఆర్ పిలుపుతో పార్టీలో చేరి బీసీ సెల్ మండల అధ్యక్షుడుగా, ఇతర కార్యక్రమాల్లో చురుగ్గా పని చేశారు.
ఔదార్యం చాటుకున్న పార్టీ నేతలు
పార్టీ నేత రఘువర్మ మృతి పట్ల వారి కుటుంబానికి పార్టీ నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్షణ సహాయం కింద బీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ రూ.10 వేలు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి రూ.5 వేలు అందజేశారు. వీటితోపాటు పలువురు పార్టీ నేతలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.