సిరిసిల్ల రూరల్ , మార్చి 10 : బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించింనందుకే తమ పై వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు పాల్పడ్డారని బీఆర్ఎస్ సీనియర్ నేత మాట్ల మధు అన్నారు. ఈ మేరకు తంగళ్ల పల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని, కేసీఆర్, కేటీఆర్‌ను వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు. తనపై వ్యక్తి గతంగా ఆరోపణలు చేయడం వల్లే తాను స్పందించాలనని స్పష్టం చేశారు.
తనకు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డబ్బులు ఇచ్చారని ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ బీఆర్ఎస్ దొరల పార్టీ అనడం సిగ్గు చేటన్నారు. ఆయనే రావు, రెడ్డిల వెంట తిరుగుతూ వారి మోచేతి నీళ్లు తాగుతున్నాడని ఘాటుగా విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆగడాలను ప్రజల్లో ఎండగడుతామన్నారు. ఈ సమావేశంలో సికివేరీ చిరంజీవి, ముత్యంరెడ్డి, బండి జగన్, ప్రేమ్ కుమార్, నవీన్ రెడ్డి, అఫ్రోజ్, నక్క కొమురయ్య, అబు బఖర్, శ్రీకాంత్ రావు, అమర్ రావు, తిరుపతి, మీసాల కృష్ణ, యాద నరేష్, మహేష్, బాలింగం పాల్గొన్నారు.