బంజారాహిల్స్, ఫిబ్రవరి 13: జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో నేపాలి గ్యాంగ్ చోరీ ఘటనలో మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 5న నందగిరిహిల్స్‌లో వ్యాపారి రవీంద్రకుమార్ శర్మ ఇంట్లో రూ.1.31 కోట్ల విలువైన ఆభరణాల చోరీకి పాల్పడిన భూపేందర్ షాహీ, కృష్ణ చాంద్‌ను మూడురోజుల క్రితం నేపాల్ సరిహద్దు దాటుతున్న సమయంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన సూత్రధారి జిబాన్ చాంద్‌తో పాటు అతడి భార్య బవిసరా కడేల్ అలియాస్ దేవి అలియాస్ బిమ్లాలు వేసిన ప్రణాళికలో భాగంగానే నేపాలి గ్యాంగ్ చోరీకి పాల్పడిందని పోలీసులు గుర్తించారు.రమేశ్ చాంద్, సుశీల్ బోహ్రాను శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితులకు ఆశ్రయం కల్పించి తప్పించేందుకు సహకరించిన లలిత్ బహుదూర్ చాంద్, జనక్ విక్రమ్ లను, భూపేందర్షాహీని వ్యాపారి రవీంద్రకుమార్ శర్మ ఇంట్లో పనికి కుదిర్చిన ఏజెంట్ మదన్‌ను అరెస్ట్ చేశారు. నందగిరి హిల్స్‌లో చోరీకి స్కెచ్ వేసిన అనంతరం జిబిన్ చాంద్ పదిరోజుల ముందుగానే నేపాల్‌కు వెళ్లిపోగా, చోరీ సొత్తును పంపకం పూర్తయిన తర్వాత భార్య బవిసరా కడేల్ సైతం నేపాల్ పారిపోవాలని ప్రణాళిక వేశారని గుర్తించారు. నేపాల్‌కు పారిపోతున్న బవిసరా కడేల్ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు మధ్యప్రదేశ్‌లో శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.