సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 28: బీఆర్ఎస్ పార్టీ నేతలు, సామాన్య రైతులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని, అక్రమ కేసులు మానుకోకపోతే ఇక జైలు భరో(Jail bharo) చేపడతామని బీఆర్ఎస్ పార్టీ నేతలు హెచ్చరించారు. అక్రమ కేసలో జైలుకు వెళ్లిన తంగళ్లపల్లి మండలం జిల్లెల్కు చెందిన రైతు అబ్బడి రాజిరెడ్డి బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో బెయిల్ మంజూరై విడుదలై ఇంటికి చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం రాజిరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజన్న, సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ పరామర్శించారు.
రాజిరెడ్డికి అండగా ఉంటామని భరోసా నిచ్చారు. అక్రమ కేసులతో రైతులను వేధించడం సరియైంది కాదని పేర్కొన్నారు. రైతు రాజిరెడ్డి ఉసురు తగులుతుందని, అక్రమ కేసులు మానికోవాలని కాంగ్రెస్ నేతల్ని హెచ్చరించారు. రాజిరెడ్డికి కేటీఅర్, పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు బండి దేవదాస్ గౌడ్, కోడూరు భాస్కర్ గౌడ్, మాజీ ఎంపీపీ మానస, మాజీ అధ్యక్షుడు అంకారపు రవీందర్, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాట్ల మధు, వలకొండ వేణుగోపాలరావు, పడిగెల రాజు, ఫాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణ రెడ్డి, పబ్బతి విజేందర్ రెడ్డి, బండి జగన్, తాండ్ర రవీందర్ రావు, సతీష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రామగౌడ్, రమేష్, కృష్ణ, పూర్ణ, జవహర్ రెడ్డి, మిరాల భాస్కర్ యాదవ్, ఆఫ్రొజ్, ఎళ్లం యాదవ్, జగత్, శ్రీకాంత్ ఉన్నారు.