సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 27: వరంగల్‌లోని ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సిరిసిల్ల (Sircilla) తంగళ్లపల్లి మండలం నుంచి భారీగా జనం తరలివెల్లారు. మొదట గ్రామాల్లో పార్టీ జెండాను ఎగర వేశారు. అనంతరం బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్లో జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై జై కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తూ వరంగల్ సభకు తరలి వెళ్లారు. తంగళ్లపల్లి నుంచి 2వేల మందితో 30 గ్రామాల నుంచి భారీగా తరలి వెళ్లినట్లు పార్టీ మండల అధ్యక్షుడు గజ భింకర్ రాజన్న తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రాజన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నేతలు ప్రజలు ఉత్సాహంగా సభకు పయనమయ్యారు. వీరిలో మాజీ ఎంపీపీ పడిగెల మానస, సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, కోడూరి భాస్కర్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఆంకారపు రవీందర్, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, పడిగెల రాజు, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, మాట్ల మధు, వల కొండ వేణుగోపాలరావు, చెన్నమనేని వెంకట్రావు, ఏసీ రెడ్డి రాంరెడ్డి, బండి జగన్, గుండు ప్రేమ్ కుమార్, కొడం సంధ్యారాణి, పూస పల్లి సరస్వతి, అబ్బడి అనిల్ రెడ్డి, మహేష్, జవహర్ రెడ్డి, మహేందర్, చిరంజీవి, అఫ్రోజ్, బొడ్డు శ్రీధర్, చంటి, భాస్కర్, జంగి టీ అంజయ్య, తదితరులు ఉన్నారు.
పార్టీ నేతల్లో ఫుల్‌జోష్..
పార్టీ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్‌తో పార్టీ నేతల్లో ఫుల్‌జోష్ వచ్చింది. కేసీఆర్ స్పీచ్ ఆకట్టుకోవడంతో కార్యకర్తల్లో నూతన ఉత్తేజం కనిపించింది. సభ సక్సెస్‌కు సహకరించిన పార్టీ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు, ప్రజలకు పార్టీ మండల అధ్యక్షుడు రాజన్న కృతజ్ఞతలు తెలిపారు.