రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.
ఇప్పటికే సిరిసిల్లలో మూడు రోజులు, వేములవాడలో ఒకరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారంచేయడంతోపాటు అభ్యర్థులకు దిశనిర్దేశం చేసిన విషయం తెలిసిందే.
రాబోయే మన సర్కారే.. బెదిరింపులకు భయపడద్దు.. గడప గడపకు తిరిగి, ఓట్లను అభ్యర్ధించాలని సూచించారు. అంతే కాకుండా ఆగిపోయిన అభివృద్ధిపనులు, స్థానిక
సమస్యలను పరిష్కారం కోసం హమీలు సైతం ఇచ్చారు. కేటీఆర్ చేసిన ప్రచారం, ఇచ్చిన భరోసాతో నూతన ఉత్సహంతో ప్రచారంలో మరింత జోరు పెంచారు.
సోమవారంతో ప్రచారం పర్వం ముగియడంతో ఆదివారం సెలువు రోజు కావడంతో సిరిసిల్లలోని 39 వార్డులు, వేములవాడలోని 28 వార్డుల్లో గులాబీ శ్రేణులు ప్రచారాలను నిర్విరామంగా
కొనసాగిస్తున్నారు. కేసీఆర్ హయాంలో పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, కాంగ్రెస్ చేసిన మోసాలను వివరిస్తూ ప్రచారంలో చేస్తున్నారు. ప్రచారాల్లో
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, వేములవాడ నియోజవర్గ ఇన్చార్జి చల్మేడ లక్ష్మీనర్సింహరావు, సిరిసిల్ల, వేమలువాడ
మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జీలు తుల ఉమ, గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణిలు ఉన్నారు.