సిరిసిల్ల రూరల్, ఆగస్టు 29 : సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్ మరో సారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. శుక్రవారం తంగళ్లపల్లి మండల కేంద్రంతో పాటు పద్మనగర్‌లో ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా తంగళ్లపల్లికి చెందిన ముద్రకోల లోకేష్ కుటుంబానికి రూ 5000, పద్మ నగర్‌కు చెందిన వేముల కరుణాకర్ కుటుంబానికి రూ.3000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. పేదవారు, బాధితులకు తనవంతు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటానని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పడిగేల రాజు, పట్టణ అధ్యక్షుడు బండి జగన్, పద్మశాలి అధ్యక్షుడు మోర శ్రీకాంత్ ,కందుకూరి రామా గౌడ్, రమేష్ తదితరులు ఉన్నారు.